ఆథరైజ్డ్ డ్రింకర్ కథ

Mon,November 11, 2019 12:22 AM

ఆ యువకుడి పేరు దేవదాస్. ఎంఏ గోల్డ్‌మెడలిస్ట్. అన్నింట్లో ఫస్టే ఉండే అతను అనుకోకుండా మద్యానికి బానిసవుతాడు. తనని తాను ఆథరైజ్డ్ డ్రింకర్ అంటూ ప్రకటించుకుంటాడు. ఇంతకి ఈ అభినవ దేవదాస్ కథాకమామిషు ఏమిటో తెలుసుకోవాలంటే 90ఎం.ఎల్ చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు శేఖర్‌రెడ్డి ఎర్ర. ఆయన దర్శకత్వంలో కార్తికేయ కథానాయకుడి నటించిన చిత్రం 90 ఎం.ఎల్. నేహా సోలంకి కథానాయిక. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించారు. డిసెంబర్ 5న ప్రేక్షకులముందుకురానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఇటీవలే అజర్‌బైజాన్‌లో మూడు పాటల్ని చిత్రీకరించాం. కార్తికేయ బాడీలాంగ్వేజ్‌కు చక్కగా కుదిరిన కథ ఇది. యువతరాన్ని ఆకట్టుకుంటుంది అన్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. ఆద్యంతం వినోదప్రధానంగా అలరించే చిత్రమిది అన్నారు. రవికిషన్, రావు రమేష్, అజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జె.యువరాజ్, సంగీతం: అనూప్‌రూబెన్స్, రచన-దర్శకత్వం: శేఖర్ రెడ్డి ఎర్ర.

600

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles