90.ఎం.ఎల్ కహానీ

Fri,September 20, 2019 10:39 PM

కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 90 ఎం.ఎల్. శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మాత. నేడు కార్తికేయ జన్మదినం. ఈ సందర్భంగా శనివారం చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఇందులో కథానాయకుడి పేరు దేవదాస్. ఎంబీఏ గోల్డ్‌మెడలిస్ట్ అయిన అతడు ఆథరైజ్డ్ డ్రింకర్‌గా పాపులర్ అవుతాడు. దేవదాస్ ఎందుకు తాగుబోతుగా మారాడు? ఆథరైజ్డ్ డ్రింకర్ అని ఎందుకు పేరు తెచ్చుకున్నాడు? అనే అంశాలు సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. ఆద్యంతం వినోదప్రధానంగా సాగే చిత్రమిది అన్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ైక్లెమాక్స్ ఘట్టాల్ని తెరకెక్కించాం. వచ్చే నెల మొదటివారంలోగా టాకీ పార్ట్ పూర్తవుతుంది. మూడు పాటల్ని యూరప్‌లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాత తెలిపారు.

630

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles