హిప్పీ ప్రేమకథ

Fri,March 22, 2019 12:06 AM

ఆర్‌ఎక్స్100 ఫేమ్ కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం హిప్పీ. వీ క్రియేషన్స్ పతాకంపై కలైపులి థాను నిర్మిస్తున్నారు. టీ.ఎన్ కృష్ణ దర్శకుడు. దిగంగన సూర్యవన్షీ, జజ్బాసింగ్ కథానాయికలు. ఈ చిత్ర టీజర్‌ను బుధవారం హీరో నాని విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజర్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. విజయవంతమైన సినిమాకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఇందులో కనిపిస్తున్నాయి. వేసవిలో అందరికి వినోదాన్ని పంచుతుందనే నమ్మకం ఉంది అని తెలిపారు. కార్తికేయ మాట్లాడుతూ నానితో కలిసి గ్యాంగ్‌లీడర్ సినిమా చేస్తున్నాను.

షూటింగ్‌లో ఆయనతో స్నేహం మొదలైంది. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఆయన్ని టీజర్‌ను విడుదలచేయమని అడిగాను. మా స్నేహం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 5వరకు ఈ గీతాల్ని హైదరాబాద్‌లో తెరకెక్కిస్తాం. టీజర్‌కు చక్కటి ప్రశంసలు లభిస్తున్నాయి. అందరి అంచనాలకు తగినట్లుగానే సినిమా ఉంటుంది అని తెలిపారు. స్నేహం, ప్రేమ, వినోదం అంశాల సమాహారంగా సాగే చిత్రమిదని దర్శకుడు చెప్పారు. జేడీ చక్రవర్తి, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్, సంగీతం: నివాస్ కె ప్రసన్న, సాహిత్యం: అనంత శ్రీరామ్.

1033

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles