కార్తికేయ 90ఎంఎల్


Mon,September 9, 2019 11:32 PM

karthikeya gummakonda 90 ml first look released

కార్తికేయ కథానాయకుడిగా స్వీయ నిర్మాణ సంస్థ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ రూపొందిస్తున్న తాజా చిత్రానికి 90ఎం.ఎల్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. యాన్ ఆథరైజ్డ్ డ్రింకర్ ఉపశీర్షిక. ఈ సినిమా ద్వారా శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నేహా సోలంకి కథానాయిక. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ వాణిజ్య అంశాలు, వినోదం కలబోసిన కథ ఇది. టైటిల్ ఇంట్రెస్టింగ్‌గా ఉందని అంటున్నారు. ఇందులో మొత్తం ఆరుపాటలుంటాయి. చంద్రబోస్ సింగిల్‌కార్డుతో సాహిత్యాన్నందించారు. రంగస్థలం తర్వాత సింగిల్‌కార్డుతో ఆయన రాసిన పాటలివి. ఈ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో తెరపై చూస్తేనే బాగుంటుంది. ఇప్పటికే 70శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 11 నుంచి హైదరాబాద్‌లో ైక్లెమాక్స్ ఘట్టాల్ని తెరకెక్కిస్తాం.ఆ తర్వాత మిగతా టాకీ, రెండు పాటలతో చిత్రీకరణ పూర్తవుతుంది అని చెప్పారు. టైటిల్‌కు తగినట్లే వైవిధ్యంగా ఉండే చిత్రమిదని, యువతరాన్ని ఆకట్టుకుంటుందని నిర్మాత అశోక్‌రెడ్డి గుమ్మకొండ తెలిపారు. రవికిషన్, రావు రమేష్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్, కాలకేయ ప్రభాకర్, సత్యప్రకాశ్, ప్రగతి, ప్రవీణ్, అదుర్స్ రఘు, నెల్లూరు సుదర్శన్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జె.యువరాజ్, సంగీతం: అనూప్‌రూబెన్స్, రచన-దర్శకత్వం: శేఖర్‌రెడ్డి ఎర్ర.

390

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles