అభినవ దేవదాస్

Wed,November 6, 2019 12:15 AM

కార్తికేయ, నేహా సోలంకి జంటగా నటిస్తున్న చిత్రం 90 ఎం.ఎల్. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంతో శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది.నిర్మాత మాట్లాడుతూ వాణిజ్య హంగులు మిళితమైన వినోదభరిత చిత్రమిది. ఎంబీఏలో గోల్డ్ మెడల్ సాధించిన అభినవ దేవదాస్ కథ ఇది. అతడు తాగుబోతుగా మారడానికి కారణమేమిటన్నది ఆకట్టుకుంటుంది. ఇటీవల అజర్‌బైజాన్ దేశంలో మూడు పాటల్ని చిత్రీకరించాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీని వెల్లడిస్తాం అని తెలిపారు. అజర్‌బైజాన్ రాజధాని బాకులోని సీజీ మౌంటెన్స్, కాస్పియన్ సముద్రంతో పాటు పలు అందమైన లొకేషన్స్‌లో ఎనిమిది రోజుల పాటు చిత్రీకరించిన పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని దర్శకుడు పేర్కొన్నారు. రవికిషన్, రావురమేష్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: జె.యువరాజ్, పాటలు: చంద్రబోస్.

525

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles