రైతు పాత్రలో కార్తీ


Tue,January 16, 2018 11:00 PM

karthi
తెలుగులోనూ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న తమిళ నటుల్లో కార్తీ ఒకరు. ఆయన నటించినపలు తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమై మంచి విజయాల్ని సొంతం చేసుకున్నాయి. ప్రతి సినిమాలో వైవిధ్యతకు ప్రాధాన్యతనిచ్చే కార్తీ తదుపరి సినిమాలో రైతు పాత్రను పోషిస్తున్నారు. కార్తీ కథానాయకుడిగా పాండిరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. కార్తీ సోదరుడు, తమిళ హీరో సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రానికి చినబాబు అనే పేరును ఖరారుచేశారు. కార్తీ లుక్‌తో పాటు టైటిల్‌ను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు సూర్య. గ్రామీణ నేపథ్యంలో రైతు గొప్పతనాన్ని చాటిచెప్పే స్ఫూర్తిదాయక కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు చిత్రబృందం తెలిపింది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. ఏప్రిల్‌లో ప్రేక్షకులముందుకురానుంది.

528
Tags

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018