అరుంధతి హిందీ రీమేక్‌లో?

Sun,September 29, 2019 12:14 AM

అనుష్క కథానాయికగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన అరుంధతి చిత్రం తెలుగులో సంచలనం సృష్టించింది. జేజమ్మగా అనుష్క అద్భుతాభినయం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కుల్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సొంతం చేసుకుంది. ప్రస్తుతం హిందీ రీమేక్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో నాయికగా అనుష్కశర్మ, కరీనాకపూర్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తొలుత అనుష్కశర్మను కథానాయికగా అనుకున్నారు. అయితే వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల డేట్స్కే టాయించలేకపోయింది. ప్రస్తుతం చిత్ర నిర్మాతలు కరీనాకపూర్‌ను సంప్రదించగా...ఆమె సినిమాలో నటించడానికి సుముఖతను వ్యక్తం చేసిందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని తెలిసింది.

636

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles