‘లాల్‌సింగ్‌ చద్దా’లో జోడీగా..


Fri,June 14, 2019 11:29 PM

Kareena Kapoor Khan to comes on board for Aamir Khan Lal Singh Chaddha

చిత్రసీమలో కొన్ని జంటలు హిట్‌పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకుంటాయి. ఆ కాంబినేషన్స్‌ పట్ల ప్రేక్షకులు ఆసక్తిని ప్రదర్శిస్తారు. అమీర్‌ఖాన్‌, కరీనాకపూర్‌ అలాంటి జోడీనే. వీరిద్దరు కలిసి ‘3 ఇడియట్స్‌' ‘తలాష్‌' వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. తాజాగా ఈ జంట వెండితెరపై మరోమారు సందడి చేయబోతున్నది. వివరాల్లోకి వెళితే...హాలీవుడ్‌ నటుడు టామ్‌హాంక్స్‌ నటించిన ‘ఫారెస్ట్‌గంప్‌' (1994) చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించుకుంది. ఈ సినిమాను ‘లాల్‌సింగ్‌ చద్దా’ పేరుతో అమీర్‌ఖాన్‌ హిందీలో రీమేక్‌ చేయబోతున్నారు.
kareenaa
అద్వైత్‌చందన్‌ దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రంలో కరీనాకపూర్‌ను కథానాయికగా ఎంపిక చేసుకున్నారు. అమీర్‌ఖాన్‌ సూచన మేరకే చిత్ర బృందం కరీనాకపూర్‌ను కథానాయికగా ఎంచుకుందని తెలిసింది. అక్టోబర్‌లో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది. కథానుగుణంగా ఈ సినిమా కోసం తాను 20కిలోల బరువు తగ్గబోతున్నట్లు ఇటీవల ఓ మీడియా సమావేశంలో ప్రకటించారు అమీర్‌ఖాన్‌. గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న అమీర్‌ఖాన్‌ ‘లాల్‌సింగ్‌ చద్దా’ రీమేక్‌ను సవాలుగా తీసుకుంటున్నారని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

998

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles