కన్నుకొట్టి చూసేనంట..


Sat,July 20, 2019 11:12 PM

Kannukotti song from Ranrangam released

శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రణరంగం. సుధీర్‌వర్మ దర్శకుడు. కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ కథానాయికలు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర బృందం కన్ను కొట్టి చూసేనంట సుందరి.. అంటూ సాగే రెండవ పాటని విడుదల చేసింది. నిర్మాత మాట్లాడుతూ కృష్ణచైతన్య రచించిన ఈ గీతాన్ని కార్తీక్ రోడ్రిగ్‌రాజ్ ఆలపించాడు. కథాపరంగా శర్వానంద్, కల్యాణి ప్రియదర్శన్ పాత్రల మధ్య వుండే ప్రేమకు నిదర్శనంగా ఈ పాట వుంటుంది. ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్‌స్టర్‌గా విలక్షణ పాత్రలో కనిపిస్తారు. ఆయన పాత్ర చిత్రణ కొత్త పంథాలో సాగుతుంది అన్నారు. ఈ చిత్రానికి మాటలు: అర్జున్, కార్తీక్, సమర్పణ: పీడీవీ ప్రసాద్.

479

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles