కబడ్డీ ప్లేయర్‌గా కంగనా


Sat,June 16, 2018 12:23 AM

Kangana Ranaut Turns Kabaddi Player

Kangana-Nauth
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కబడ్డీప్లేయర్ అవతారమెత్తబోతున్నది. ఈ చిత్రానికి అశ్వనీ అయ్యర్ తివారీ దర్శకత్వం వహిస్తారు. మహిళా ప్రధాన ఇతివృత్తాలతో తెరకెక్కిన నిల్‌బట్టేయ్ సన్నాట, బైరెల్లీ కి బర్ఫీ చిత్రాలతో ఆమె హిందీ చిత్రసీమలో ప్రతిభావంతురాలైన దర్శకురాలిగా పేరు తెచ్చుకున్నారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా తనకు ఎదురైన సవాళ్లను అధిగమించే క్రమంలో ఓ కబడ్డీ ప్లేయర్‌కు ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఇందులో కబడ్డీ ప్లేయర్‌గా నటించనున్న కంగనా ఆటలో ప్రావీణ్యం కోసం నిజమైన క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆటలో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిసింది.

1253

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles