నాతో పెట్టుకుంటే..!

Fri,February 8, 2019 11:45 PM

బాలీవుడ్ నటి కంగనారనౌత్‌ది దూకుడు స్వభావమని చెబుతారు. ముక్కుసూటితనంతో పాటు ఏ విషయంలోనైనా నిర్మొహమాటంగా తన అభిప్రాయం వెలిబుచ్చుతూ తరచు వివాదాల్లో చిక్కుకుంటున్నదీ హిమాచల్ సొగసరి. తాజాగా బాలీవుడ్ ప్రముఖులపై ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కొందరు తనను లక్ష్యంగా చేసుకుని వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని, వారందరి బండారం బయటపెడతానని కంగనా హెచ్చరించడం బాలీవుడ్ చిత్రసీమలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆమె నటించిన మణికర్ణిక విజయాన్ని పురస్కరించుకొని కంగనా పాత్రికేయులతో ముచ్చటించింది. మణికర్ణిక ప్రచార కార్యక్రమాలకు పరిశ్రమలోని సెలబ్రిటీలు ఎందుకు రావడం లేదన్న ప్రశ్నపై కంగనా మండిపడింది. కెరీర్‌లో ఇప్పటికే నాలుగుసార్లు జాతీయ అవార్డులు స్వీకరించాను. మణికర్ణికతో దర్శకురాలిగా సత్తాచాటాను. నాకు మరొకరితో ప్రచారం చేయించుకునే అవసరం ఏముంది? పరిశ్రమలో నాకు వ్యతిరేకంగా ఓ బృందం పనిచేస్తున్నది.

నేను వారితో స్నేహంగా ఉండటానికే ప్రయత్నిస్తున్నాను. కానీ వారు మాత్రం నాపై ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. నా జోలికి వస్తే ఒక్కొక్కరి చరిత్రలు బయటపెడతా అంటూ తీవ్రంగా హెచ్చరించింది కంగనా. మణికర్ఙిక సినిమా విషయంలో దర్శకుడు క్రిష్, కంగనా మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. డెరెక్షన్ క్రెడిట్ విషయంలో పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ వివాదం పూర్తిగా సద్దుమణగక ముందే కంగనారనౌత్ పరిశ్రమ వ్యక్తులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం అందరిని విస్మయానికి గురిచేసింది.

1851

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles