బయోపిక్ కోసం 24 కోట్లు!


Mon,March 25, 2019 12:18 AM

Kangana Ranaut Offered Rs. 24 Crores For Jayalalithaa Biopic

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, సినీనటి జయలలిత జీవితం ఆధారంగా తలైవీ పేరుతో ఓ సినిమా తెరకెక్కనున్నది. ఈ బయోపిక్‌లో జయలలిత పాత్రలో బాలీవుడ్ నటి కంగనారనౌత్ నటించనున్నది. ఈ సినిమా కోసం ఆమె ఇరవై నాలుగు కోట్ల పారితోషికాన్ని స్వీకరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్‌ను అందుకోనున్న కథానాయికగా కంగనారనౌత్ నిలవబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రియాంకచోప్రా, కరీనాకపూర్, రణ్‌వీర్‌సింగ్, షాహిద్ కపూర్‌లాంటి స్టార్ నాయకానాయికలు సినిమా కోసం పదికోట్ల రూపాయల వరకు పారితోషికాన్ని వసూలు చేస్తున్నారు. సంజయ్‌లీలాభన్సాలీ దర్శకత్వంలో రూపొందిన పద్మావత్ సినిమా కోసం దీపికా పదుకునే 13 కోట్ల రెమ్యునరేషన్‌ను అందుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. వారితో పోలిస్తే కంగనా తలైవీ కోసం రెండింతల పారితోషికాన్ని స్వీకరించనున్నట్లు తెలిసింది. పాన్ ఇండియన్ సినిమాగా అన్ని భాషల వారికి ఈ బయోపిక్ చేరువకావాలంటే కంగనా రనౌత్ లాంటి ప్రతిభాసంపత్తి, ఇమేజ్ కలిగిన నటి అయితేనే బాగుంటుందని భావించిన చిత్రబృందం ఆమెకు 24 కోట్ల పారితోషికం చెల్లించడానికి సిద్ధపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాపై కంగనా రనౌత్ మాట్లాడుతూ జయలలిత కథతో నా జీవితానికి దగ్గరి పోలికలు ఉన్నాయి. ఈ బయోపిక్ కథను దర్శకుడు చెబుతున్నపుడు నా కథే వింటున్న అనుభూతికి లోనయ్యాను. ఎన్నో గొప్ప విజయాల్ని సాధించిన స్ఫూర్తిదాత జయలలిత పాత్రలో నటించడం ఆనందంగా ఉంది అని తెలిపింది. ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు. విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు.

677

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles