కాళీ..డబుల్‌మాస్


Sat,April 13, 2019 01:05 AM

Kanchana 3 to release on April 19

రాఘవలారెన్స్ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం కాంచన-3. ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత ఠాగూర్ మధు విడుదలచేస్తున్నారు. ఓవియా, వేదిక కథానాయికలు. సెన్సార్ పూర్తయింది. యు.ఎ సర్టిఫికెట్ లభించింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 19న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ లారెన్స్ కథానాయకుడిగా నటించిన ముని సిరీస్ చిత్రాల పరంపరలో వస్తున్న నాలుగో సీక్వెల్ ఇది. హారర్ కామెడీ కథాంశానికి మానవీయ విలువల్ని జోడించి లారెన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఓ మురికివాడకు నాయకుడైన కాళీ పోరాటం ఎందుకోసమన్నది ఆకట్టుకుంటుంది. కథ, కథనం, గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. 220 రోజులు పాటు శ్రమించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు, లారెన్స్ గెటప్‌కు మంచి స్పందన లభిస్తున్నది. టీజర్‌లో నువ్వు మాస్ అయితే నేను డబుల్ మాస్ అంటూ ఆయన చెప్పిన సంభాషణలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. లారెన్స్ నటవిశ్వరూపాన్ని చాటిచెప్పే సినిమా ఇది అని తెలిపారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాఘవ లారెన్స్.

1115

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles