ఐదు రోజులు..75 కోట్లు..!


Wed,April 24, 2019 11:59 PM

Kanchana 3 Movie Telugu Success meet

రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన తమిళ చిత్రం కాంచన-3. ఈ చిత్రాన్ని ఇదే పేరుతో తెలుగులో లైట్ హౌజ్ ప్రొక్షన్స్ పతాకంపై నిర్మాత బి. మధు తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్‌ని చిత్రబృందం బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా రాఘవలారెన్స్ మాట్లాడుతూ కాంచన-3 చిత్రానికి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్. గత సిరీస్‌లని దృష్టిలో పెట్టుకుని థీయేటర్‌కు వచ్చే ప్రేక్షకులకు నచ్చుతుందా? నచ్చదా?. వారికి నచ్చే ఏఏ అంశాల్ని జోడించి ఈ సిరీస్‌ని రూపొందించాలన్న భయంతో దాదాపు రెండేళ్లు శ్రమించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. ప్రేక్షకులు కోరుకున్న స్థాయిలో వుండటంతో ఈ చిత్రానికి బ్రహ్మరథంపడుతున్నారు.

తెలుగులో ఠాగూర్ మధు విడుదల చేయడం ఆనందంగా వుంది. తమన్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. కాంచన వంద కోట్లు వసూలు చేసింది. ఆ స్థాయిలో కాంచన-3 కూడా వసూలు చేసేలా వుంది. ఈ విజయం తరువాత కొంత విరామం తీసుకుని కాంచన-4 చేయాలనుకున్నాను. కానీ డిస్ట్రిబ్యూటర్లు, సన్ పక్చర్స్, మా కుటుంబ సభ్యులు వెంటనే చేయమని కోరుతున్నాయి. వాళ్ల ఒత్తిడి మేరకు హిందీ కాంచన పూర్తి కాకగానే కాంచన-4 సెట్స్‌పైకి తీసుకొస్తాను. మా సినిమాతో పాటు జెర్సీ చిత్రం విడుదలైంది. నిన్న రాత్రే సినిమా చూశాను. అద్భుతంగా వుంది. అంతా చూడాలని కోరుకుంటున్నాను అన్నారు. ఠాగూర్ మధు మాట్లాడుతూ నేను ఇబ్బందుల్లో వున్న సమయంలో లారెన్స్ నాకు ఈ సినిమా ఇచ్చి సపోర్ట్‌గా నిలిచారు.

విడుదలైన ఐదు రోజుల్లోనే తెలుగు, తమిళ భాషల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా 75 కోట్ల మార్కును దాటింది. రానున్న ఐదు రోజుల్లో వంద కోట్ల మార్కును అధిగమించే అవకాశం వుంది అన్నారు. వేదిక మాట్లాడుతూ కాంచన-3 చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ హిట్ చేశారు. ఇలాంటి చిత్రంలో నేనూ ఓ భాగమైనందుకు ఆనందంగా వుంది అన్నారు. కాంచన-3 ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముని, కాంచన. గంగ చిత్రాలని మించి భారీ వసూళ్లని సాధిస్తోందని బీఏ రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిక్కీతంబోలి, భరత్‌చౌదరి, వీరినాయుడు పాల్గొన్నారు.

4091

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles