కుటుంబసభ్యులతో స్వగ్రామంలో..

Thu,November 7, 2019 11:30 PM

విలక్షణ నటుడు కమల్‌హాసన్ గురువారంనాటితో 65వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదిన వేడుకలు తమిళనాడులోని స్వగ్రామం పరమకుడిలో కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరిగాయి. ఈ వేడుకలో ఆయన కూతుళ్లు శృతిహాసన్, అక్షరహాసన్‌తో పాటు సోదరుడు చారుహాసన్, ఆయన తనయ సుహాసిని పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కమల్‌హాసన్ దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. నటుడిగా ఈ ఏడాదితో కమల్‌హాసన్ అరవై ఏళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకున్నారు. ఈ నేపథ్యంలో జన్మదిన వేడుకలతో పాటు అరవైఏళ్ల సినీ ప్రయాణ ఉత్సవాల్ని మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు కమల్‌హాసన్‌కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలందజేశారు. నాన్న కమల్‌హాసన్ ఆరవై ఏళ్ల నట జీవిత వేడుకల్ని పరమకుడిలో జరుపుకోవడం ఆనందంగా ఉందని శృతిహాసన్ తెలిపింది.

420

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles