కల్యాణ్‌రామ్ చారిత్రక చిత్రం?


Wed,March 13, 2019 12:00 AM

Kalyan Ram who is okay for another different movie after 118

118 చిత్రంతో ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చారు కల్యాణ్‌రామ్. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తోరూపొందిన ఈ చిత్రం విమర్శకుల్ని మెప్పించింది. కథాంశాలపరంగా నవ్యతకు ప్రాధాన్యతనిచ్చే కల్యాణ్‌రామ్ తాజాగా మరో వినూత్న కథా చిత్రానికి ఓకే చెప్పినట్లు తెలిసింది. సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా మల్లిడి వశిష్ట్ దర్శకుడిగా పరిచయంకాబోతున్నాడని సమాచారం. పునర్జన్మల నేపథ్య కథాంశమిదని, 1400 శతాబ్దంలో కథ జరుగుతుందని సమాచారం. చారిత్రక ఇతివృత్తం కావడంతో కల్యాణ్‌రామ్ ఈ చిత్రానికి వెంటనే ఓకే చెప్పారని అంటున్నారు. స్వీయనిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు తుగ్లక్ అనే టైటిల్‌ను ఖరారు చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు.

2365

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles