కల్యాణ్‌రామ్ ఎంత మంచివాడవురా


Sat,July 6, 2019 12:53 AM

kalyan ram satish vegesna next movie titled as entha manchivaadavuraa

కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ఎంత మంచివాడవురా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుభాష్ గుప్తా, శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. శుక్రవారం కల్యాణ్‌రామ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని టైటిల్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ కల్యాణ్‌రామ్ స్వతహాగా మంచి మనసున్న వ్యక్తి. ఈ సినిమాలో పాత్ర కూడా అదే విషయాన్ని ప్రతిబింబిస్తుంది. శ్రేయోభిలాషులందరూ టైటిల్ బాగుందని అభినందిస్తున్నారు. ఈ నెల 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం.

హైదరాబాద్, రాజమండ్రి, ఊటీలో చిత్రీకరణ జరుపుతాం. వాణిజ్య అంశాల మేళవింపుతో అన్ని వర్గాలను ఆకట్టుకునే చిత్రమిది అన్నారు. కథానుగుణంగా ఈ టైటిల్ పెట్టామని, నిత్యజీవితంలో మనం తరచు ఉపయోగించే మాట ఇదని దర్శకుడు చెప్పారు. మోహరీన్, వి.కె.నరేష్, సుహాసిని, తనికెళ్ల భరణి, పవిత్ర లోకేష్, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్ తోట. సంగీతం: గోపీసుందర్, నిర్మాత: ఉమేష్‌గుప్తా, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సతీష్ వేగేశ్న.

1437

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles