నేను మా నాన్నగారిలా..


Fri,October 12, 2018 12:14 AM

Kalyan Ram plays father Hariskrishna in NTR biopic shares intense first look from film

విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ఎన్టీఆర్. ఆయన తనయుడు బాలకృష్ణ టైటిల్‌రోల్‌ని పోషిస్తున్నారు. క్రిష్ (రాధాకృష్ణ) దర్శకుడు. ఎన్.బి.కె.ఫిల్మ్స్ పతాకంపై బాలకృష్ణ, సాయికొర్రపాటి, విష్ణువర్ధన్ ఇందూరి, ఎం.ఆర్.వి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దివంగత నటుడు నందమూరి హరికృష్ణ పాత్రలో ఆయన తనయుడు, కథానాయకుడు కళ్యాణ్‌రామ్ నటిస్తున్నారు. 30 ఏళ్ల క్రితం మా బాబాయ్‌తో బాలగోపాలుడు సినిమాలో బాలుడిగా నటించాను. మళ్లీ ఇప్పుడు బాబాయ్..వాళ్ల నాన్నగారిలా.. నేను మా నాన్నగారిలా అంటూ ఈ బయోపిక్‌లో నటిస్తున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు కల్యాణ్‌రామ్. సినిమా చిత్రీకరణకు సంబంధించిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో చైతన్యరథం ముందు నిల్చొని ఎన్టీఆర్ గెటప్‌లో బాలకృష్ణ... హరికృష్ణ పాత్రలో నటిస్తున్న కల్యాణ్‌రామ్ భుజంపై చేయివేసి కనిపించడం ఆకట్టుకుంటున్నది. ఈ సినిమాను ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు పేరుతో రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. తొలి భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని, రెండో భాగంలో రాజకీయ జీవితాన్ని ఆవిష్కరించబోతున్నారు.

2375

More News

VIRAL NEWS