సతీష్ వేగేశ్న దర్శకత్వంలో


Thu,June 13, 2019 01:00 AM

Kalyan Ram and Mehreen to star in Satish Vegesna family entertainer

118 చిత్రంతో మంచి విజయాన్ని దక్కించుకున్నారు హీరో కల్యాణ్‌రామ్. వినూత్న ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయన నటనకు ప్రశంసలు లభించాయి. తాజాగా కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్నది. ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈసినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనున్నది. ఉమేష్ గుప్తా నిర్మించనున్న ఈ చిత్రానికి శివలెంక కృష్ణప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరించనున్నారు.
Mehreen
కల్యాణ్‌రామ్‌కు జోడీగా మోహరీన్ కథానాయికగా నటిస్తున్నది. నిర్మాత మాట్లాడుతూ భావోద్వేగాలు మిళితమైన ఫీల్‌గుడ్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. దర్శకుడు సతీష్ వేగేశ్న అన్ని వర్గాలను అలరించేలా చక్కటి కథను సిద్ధం చేశారు అని తెలిపారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతాన్ని అందించనున్నారు.

1189

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles