వినూత్న ప్రేమకథ


Sun,May 20, 2018 11:50 PM

Kalyan Dev Starts Dubbing for his Debut Movie

Kalyan-dhev
చిరంజీవి అల్లుడు కల్యాణ్‌దేవ్ కథానాయకుడిగా వారాహి చలనచిత్రం పతాకంపై ఓ సినిమా తెరకెక్కుతున్నది. రాకేష్‌శశి దర్శకత్వం వహిస్తున్నారు. రజని కొర్రపాటి నిర్మాత. మాళవిక నాయర్ కథానాయిక. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం కల్యాణ్‌దేవ్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. నిర్మాత మాట్లాడుతూ వినూత్న కథ, కథనాలతో తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. ప్రేమ, వినోదం, భావోద్వేగాల సమాహారంగా సాగుతుంది. కల్యాణ్‌దేవ్ పాత్ర నవ్యరీతిలో ఉంటుంది. సెంథిల్‌కుమార్ ఛాయాగ్రహణం, రామకృష్ణ కళా దర్శకత్వం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, విడుదల తేదీని వెల్లడిస్తాం అని తెలిపారు. తనికెళ్లభరణి, మురళీశర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణ సారథి: సాయికొర్రపాటి, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్.

1229

More News

VIRAL NEWS