కల్కితో సమాధానం దొరికింది

Sun,February 3, 2019 11:24 PM

గరుడ వేగ విజయం తర్వాత మంచి కథల కోసం దాదాపు ఆరునెలల పాటు అన్వేషించాను. ప్రశాంత్‌వర్మ చెప్పిన ఈ కథ నన్ను బాగా ఆకట్టుకుంది. గరుడవేగకు ముందు కూతుళ్లు నటిస్తున్నారు..నువ్వు విశ్రాంతి తీసుకో అని సి.కల్యాణ్ అన్నారు. సినిమా సక్సెస్ తర్వాత కలిసి సినిమా చేద్దామని ముందుకు వచ్చారు. ఆయనతో ఈ సినిమా చేయడాన్ని ప్రమోషన్‌గా భావిస్తున్నాను అని అన్నారు రాజశేఖర్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కల్కి. ప్రశాంత్‌వర్మ దర్శకుడు. సి.కల్యాణ్ నిర్మాత. అదాశర్మ, నందితాశ్వేత కథానాయికలు. నేడు రాజశేఖర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో చిత్రబృందం టీజర్‌ను విడుదలచేసింది. సి.కల్యాణ్ మాట్లాడుతూ 1983 నేపథ్యంలో సాగే విభిన్నమైన సినిమా ఇది.

70 శాతం చిత్రీకరణ పూర్తయింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్‌లలో తదుపరి షెడ్యూల్స్‌ను చిత్రీకరిస్తాం అని తెలిపారు.గరుడవేగ సినిమా చేస్తున్నప్పుడు ఎంత ఉత్సుకతకు లోనయ్యానో అదే ఎైగ్జెట్‌మెంట్ ఈ సినిమాకు కలుగుతున్నది. ఈ సినిమా కోసం నా కంటే ఎక్కువగా జీవిత కష్టపడుతున్నది. ఇదివరకు నన్ను అందరూ యాంగ్రీ యంగ్‌మెన్ అనేవారు. వయసుపై బడిన తర్వాత ఆ పేరును కొనసాగించడం ఎలా అనుకుంటున్న తరుణంలోఈ సినిమాతో ప్రశాంత్‌వర్మ మంచి సమాధానం ఇచ్చారు. నన్ను యాంగ్రీస్టార్‌గా సినిమాలో ఆవిష్కరించారు అని రాజశేఖర్ చెప్పారు. దర్శకుడు ప్రశాంత్‌వర్మ మాట్లాడుతూ అ! కంటే పదిరేట్లు ఎక్కువ కష్టపడి నేను చేస్తున్న సినిమా ఇది. కల్కి ఉన్నతమైన టైటిల్ కావడంతో గౌరవంగా, బాధ్యతగా భావించి ఈ సినిమా చేస్తున్నాను. కమర్షియల్ సినిమాల్లో సొంత ముద్రను సృష్టించుకుంటుంది. ఈ సినిమాను ఫ్రాంచైజ్‌గా చేయాలని ఉంది.

రాజశేఖర్‌గారి వచ్చే ఏడాది పుట్టినరోజుకు సీక్వెల్ ప్రారంభించాలనుకుంటున్నాం. పరిశోధన అధికారిగా రాజశేఖర్ పాత్ర వినూత్నంగా ఉంటుంది అని తెలిపారు. గరుడవేగకు ముందు అధఃపాతాళానికి వెళ్లిన తాము కెరీర్‌లో మళ్లీ పైకి రాగలుగుతామా? లేదా? అనే భయం ఉండేదని, సినిమా పెద్ద విజయాన్ని సాధించి తమకు పూర్వవైభవాన్ని తెచ్చిపెట్టిందని, ప్రస్తుత తరుణంలో సినిమా తీయడం, పెట్టిన డబ్బుల్ని వెనక్కి రాబట్టుకోవడం కష్టంగా మారిందని, కథను నమ్మి సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు రావడం ఆనందంగా ఉందని, మే నెలలో కల్కి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని జీవిత రాజశేఖర్ చెప్పింది. ఈ కార్యక్రమంలో శివాని, శివాత్మిక, శివేంద్ర, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

2433

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles