స్వీయ నిర్మాణంలో...


Mon,June 17, 2019 10:56 PM

Kajal to turn producer for director Teja

కాజల్‌ అగర్వాల్‌, దర్శకుడు తేజ కాంబినేషన్‌లో నాలుగో సినిమా రాబోతుందా? అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. మహిళా ప్రధాన ఇతివృత్తంతో తేజ సిద్ధం చేసిన కథ నచ్చడంతో కాజల్‌ ఈ సినిమాలో నటించడానికి సంసిద్ధతను వ్యక్తంచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత సమాజ పోకడలు, మహిళల పట్ల కొనసాగుతున్న వివక్ష నేపథ్యంలో వినూత్నమైన ఇతివృత్తంతో తేజ ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు తెలిసింది. హీరోయిన్‌గా నటిస్తూనే కాజల్‌ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించబోతున్నట్లు సమాచారం. స్క్రిప్ట్‌ పనులు తుదిదశకు చేరుకున్నట్లు తెలిసింది. కాజల్‌, తేజ కలయికలో ఇటీవలే విడుదలైన ‘సీత’ చిత్రం ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది.

1052

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles