అదే పెద్ద బహుమతి

Mon,June 19, 2017 12:43 AM

RanaKajal
నేనే రాజు నేనే మంత్రి తో యాభై చిత్రాల మైలురాయిని చేరుకోవడం ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రమిది అని తెలిపింది కాజల్ అగర్వాల్. ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం నేనే రాజు నేనే మంత్రి. రానా హీరోగా నటిస్తున్నారు. తేజ దర్శకుడు. సురేష్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్‌చౌదరి నిర్మిస్తున్నారు. నేడు కాజల్ అగర్వాల్ జన్మదినం. ఈ సినిమా గురించి ఆమె ముచ్చటిస్త్తూ తేజ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీకల్యాణంతో చిత్రసీమకు పరిచయమయ్యాను. పదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఆయన దర్శకత్వంలో నటిస్తున్న చిత్రమిది. రాధ అనే అమ్మాయిగా నా పాత్ర విభిన్నంగా సాగుతుంది.

చిత్రపరిశ్రమలో నాకున్న మంచి స్నేహితుల్లో రానా ఒకరు.ఆ స్నేహం వల్లే అభిప్రాయాలు, ఆలోచనలను పరస్పరం పంచుకోవడమే కాకుండా నా పాత్రలో ఇమిడిపోయి నటించడానికి అవకాశం లభించింది. గత కొన్ని నెలలుగా ఈ సినిమా కోసం సాగించిన ప్రయాణం ఎన్నో మధురానుభూతులను మిగిల్చింది. ఈ ఏడాది నా పుట్టినరోజుకు ఈ చిత్రమే పెద్ద బహుమతి అని తెలిపింది. కేథరీన్, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్

697

More News

మరిన్ని వార్తలు...