బన్నీతో ఐటెంసాంగ్?


Thu,August 22, 2019 12:00 AM

kajal aggrawal item song in allu arjun and trivikram next movie

ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతా గ్యారేజ్ చిత్రంలో పక్కా లోకల్.. అనే ప్రత్యేక గీతంలో మాస్ శైలి నృత్యాలతో అభిమానుల్ని ఫిదా చేసింది కాజల్ అగర్వాల్. తాజాగా ఆమె మరో ఐటెంసాంగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం అల వైకుంఠపురంలో. కుటుంబ అనుబంధాలు, అప్యాయతల కలబోతగా త్రివిక్రమ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కథానుగుణంగా ఓ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ పాటలో కాజల్ నటించబోతున్నట్లు చెబుతున్నారు. సాహిత్య ప్రధానంగా సందర్భానుసారం వచ్చే విలక్షణ గీతం కావడంతో ఈ ఐటెంసాంగ్‌లో నటించడానికి కాజల్ అంగీకరించినట్లు సమాచారం. త్వరలో ఈ పాటను అల్లు అర్జున్, కాజల్‌లపై భారీ హంగులతో తెరకెక్కించనున్నట్లు తెలిసింది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, సుశాంత్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. హారిక హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది.

1119

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles