నిర్మాతగా కాజల్?


Thu,February 14, 2019 12:19 AM

Kajal Aggarwal to don producers hat

తమ అభిరుచులకు అనుగుణమైన మంచి కథ దొరికితే నిర్మాతల కోసం ఎదురుచూడకుండా తామే నిర్మాణబాధ్యతల్ని చేపట్టడానికి సిద్ధపడుతున్నారు నేటితరం నాయకానాయికలు. ఇప్పటికే చాలా మంది హీరోహీరోయిన్లు నిర్మాతలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా ఈ జాబితాలో కాజల్ అగర్వాల్ చేరనున్నట్లు తెలిసింది. కేఏ వెంచర్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించనున్న ఆమె తెలుగులో ఓ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. అ! ఫేమ్ ప్రశాంత్‌వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహిళా ప్రధాన కథాంశంతో దర్శకుడు సిద్ధం చేసిన పాయింట్‌లోని కొత్తదనం నచ్చడంతో కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తూ నిర్మాణ బాధ్యతల్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. భవిష్యత్తులో తన నిర్మాణ సంస్థ ద్వారా మరిన్ని కథాబలమున్న మంచి చిత్రాల్ని నిర్మించాలనే ఆలోచనలో కాజల్ అగర్వాల్ ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఇండియన్-2 చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నది .

1876

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles