ప్రేమను పంచాలి!

Thu,September 19, 2019 10:37 PM

సానుకూల దృక్పథంతో ఆలోచించడమే తన గ్లామర్ రహస్యమని చెప్పింది కాజల్ అగర్వాల్. కాలంలో వెనక్కి ప్రయాణించే అవకాశం దొరికితే 1960ల్లోకి వెళ్లిపోవాలనుందని చెప్పిందీ భామ. గురువారం అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు కాజల్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా బదులిచ్చింది. ఫ్యాన్‌వార్‌పై అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ..ప్రతి ఒక్కరూ ప్రేమను పంచే ప్రయత్నం చేయాలి. విద్వేషాలతో మనసును కల్మషం చేసుకోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు అని చెప్పింది. కెరీర్‌లో సాధించాల్సింది ఎంతో ఉందని, ఇప్పుడే సినిమాల్లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన అనుభూతి కలుగుతుందని పేర్కొంది. ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి క్రమశిక్షణతో శ్రమిస్తానని తెలిపింది. పాప్‌సింగర్ బియాన్సీ తన అభిమానగాయని.


క్రికెటర్లలో ధోనీ, విరాట్ కోహ్లి ఆటను ఎంజాయ్ చేస్తాను. మార్వెల్ సినిమాలో అవకాశం వస్తే కరోల్ డెన్వర్స్ పాత్రలో నటించాలనుంంది. విజయ్ దేవరకొండ సినిమాల్ని ఎంపికచేసుకునే తీరు, నటనలో కనబరిచే వైవిధ్యత నన్ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సుదీర్ఘకాలం ఇండస్ట్రీలో కొనసాగే ప్రతిభావంతుడైన నటుడు ఆయన అని చెప్పింది కాజల్. మంచి కథ కుదిరితే తప్పకుండా ఎన్టీఆర్‌తో మరో సినిమా చేస్తానని తెలిపింది. ప్రస్తుతం ముంబయి సాగా, ఇండియన్-2, కాల్‌సెంటర్ సినిమాల్లో నటిస్తున్నానని ట్విట్టర్ ద్వారా బదులిచ్చింది.

395

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles