సమయాన్ని వృథా చేయను!

Tue,March 21, 2017 12:08 AM

kajal
సామాజిక మాధ్యమాలరాకతో తారలకు అభిమానులకు మధ్య దూరం తగ్గింది. సినిమాలు, వ్యక్తిగత జీవిత విశేషాలు, వివాదాలు... ఇలా విషయం ఏదైనా తమ మనసులోని మాటలను ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా నటీనటులు నేరుగా అభిమానులతో పంచుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో తారలకు కోట్లలో అభిమాన గణం ఉన్నారు. అయితే సాంకేతికత విషయంలో తనకు పరిజ్ఞానం తక్కువని చెబుతున్నది కాజల్ అగర్వాల్. సినిమాలతో బిజీగా ఉండటంతో సోషల్‌మీడియాకు సమయాన్ని కేటాయించడం కుదరడం లేదని అంటున్నది. ఇటీవలే తన పేరిట సొంతంగా ఓ మొబైల్ యాప్‌ను ప్రారంభించింది కాజల్ అగర్వాల్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోషల్‌మీడియాపై అతిగా ఆధారపడటం నాకు నచ్చదు. ఏదైతే చెప్పాలని అనుకుంటానో అదే అంశాన్ని చర్చిస్తాను. అంతేతప్ప నాకు సంబంధం లేని విషయాల్ని ప్రస్తావిస్తూ ఇతరుల సమయాన్ని వృథాచేయను. సినిమానే నా ప్రపంచం. వాటి గురించి తప్ప వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావించను అని తెలిపింది. అలాగే జయాపజయాల ఆధారంగా ప్రతిభను నిర్ణయించడం సరికాదని, ఫ్లాప్‌ల కారణంగా బాలీవుడ్‌కు తాను దూరమైనట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, దక్షిణాదిలో బిజీగా ఉండటంతో హిందీ సినిమాలపై దృష్టిసారించలేకపోతున్నానని తెలిపింది.

31న కాజల్ ఎంత వరకు ఈ ప్రేమ!


జీవా, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన తమిళ చిత్రం కావలై వేండం. డీకే దర్శకుడు. డీవీ సినీ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత డి. వెంకటేష్ ఎంతవరకు ఈ ప్రేమ పేరుతో ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 31న విడుదలకానుంది. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది.

మనస్పర్థల కారణంగా విడిపోయినా ఓ ప్రేమజంట తిరిగి ఏ విధంగా ఏకమయ్యారనేది హృద్యంగా ఉంటుంది. జీవా, కాజల్ అగర్వాల్ కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. వినోదం, ప్రేమ, యాక్షన్, కుటుంబ బంధాలకు ప్రాధాన్యముంటుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇటీవలే విడుదలైన ప్రచార చిత్రానికి, పాటలకు చక్కటి స్పందన లభిస్తున్నది. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే చిత్రమిది అని తెలిపారు. బాబీసింహా, సునయన, శృతిరామకృష్ణన్, జ్యోతిలక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: లియాన్ జేమ్స్.

1736

More News

మరిన్ని వార్తలు...