సరికొత్త లక్ష్యం


Tue,March 13, 2018 04:02 AM

kaja-agarwal.jpg
వృత్తిపరంగా తాను కొత్త లక్ష్యాల్ని నిర్దేశించుకున్నానని చెప్పింది పంజాబీ సుందరి కాజల్ అగర్వాల్. భాషాపరంగా ఎలాంటి హద్దులు విధించుకోలేదని, అవకాశమొస్తే హాలీవుడ్‌లో కూడా నటించడానికి సిద్ధమేనని పేర్కొంది. కథ, నా పాత్ర చిత్రణ నచ్చితే ఏ భారతీయ భాషా చిత్రంలోనైనా నటించడానికి అభ్యంతరం లేదు. ప్రస్తుతం సృజనాత్మక పరిధులు విస్తరిస్తున్నాయి. నా సమకాలీన కథానాయికలు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. తమ ప్రతిభకు మెరుగులుదిద్దుకుంటూ ప్రపంచ సినిమాపై సత్తా చాటుతున్నారు.

ప్రస్తుతం నాకు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మంచి అవకాశాలొస్తున్నాయి. భవిష్యత్తులో అంతర్జాతీయ సినిమా నటించాలని వుంది. ఆ అవకాశం వస్తే సంతోషంగా స్వీకరిస్తాను అని చెప్పింది. పెళ్లి గురించి ప్రస్తావించగా ప్రస్తుతం మూడు భాషల్లో సినిమాలు చేస్తున్నాను. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనే విషయాన్ని ఇంకా నిర్ణయించుకోలేదు. నా మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడితే మాత్రం తాత్సర్యం చేయకుండా ప్రేమ విషయాన్ని అందరికి తెలియజేస్తాను అని చెప్పింది కాజల్ అగర్వాల్.

2197

More News

VIRAL NEWS