రవితేజకు జోడీగా..!


Fri,March 22, 2019 12:07 AM

Kajal Agarwal and Catherine Tresa For Ravi Teja Kanaka Durga Movie

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజా. వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇదిలా వుండగానే రవితేజ మరో చిత్రాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. విజయ్ హీరోగా నటించిన తేరి చిత్రం తెలుగులో పోలీసోడు పేరుతో అనువాదమై విడుదలైంది. ఇదే చిత్రాన్ని రవితేజ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రీమేక్ చేయబోతున్నారు. మైత్రీమూవీమేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. కాగా ఆయనకు జోడీగా కాజల్ అగర్వాల్, కేథరిన్‌లు నటించనున్నట్లు తెలిసింది. తెలుగు నేటివిటీకి మార్పులు చేసి తెరకెక్కించనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ చిత్రానికి కనకదుర్గ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు.

2498

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles