మా సహాయం ధైర్యాన్నివ్వాలి!


Sun,September 23, 2018 11:51 PM

Kadambari Kiran Speech Manam Saitham Press Meet

మనం సైతం కోసం ప్రముఖులందరూ నన్ను ప్రోత్సహిస్తున్నారు. నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు బాగున్నాయి అంటూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు కాదంబరి కిరణ్. ఆయన మనం సైతం పేరుతో సేవా సంస్థను స్థాపించి ఆపదలో వున్నవారికి ఆపన్న హస్తాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో కొంత మందికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం కాదంబరి కిరణ్ మాట్లాడుతూ పేదరికాన్ని రూపుమాపకున్నా ఆర్థికంగా చితికిన జీవితాలకు మేము అందించే చిరు సాయం ధైర్యాన్ని ఇవ్వాలనేదే మా ధ్యేయం. ఈ ఏడాది ఇప్పటికి 90 మందికి ఆర్థిక సహాయాన్ని అందజేశాం. చిత్ర పరిశ్రమలో చిరంజీవి, కృష్ణ గారి దగ్గరి నుంచి ఎంతో మంది మనం సైతంకు అండగా నిలుస్తున్నారు. త్వరలో కేటీఆర్, ఎన్టీఆర్‌తో కలిసి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నాం. కానీ ఇటీవల జరిగిన అనుకోని సంఘటనల కారణంగా దాన్ని వాయిదా వేశాం. ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 20 లక్షల రూపాయలను పేదలకు అందజేశాం అన్నారు. ఒక మంచి పని చేయడం చాలా కష్టం. కాదంబరి కిరణ్ అలాంటి శ్రమను ఎంచుకున్నాడు అని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఈ కార్యక్రమంలో నందినిరెడ్డి, రజిత, డ్యాన్స్ మాస్టర్ సత్య, గాయని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

1191

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles