సందీప్‌రెడ్డి క్రైమ్ డ్రామా


Wed,June 5, 2019 12:06 AM

Kabir Singh will now hit the screens on June 21.

అర్జున్‌రెడ్డి చిత్రంతో తెలుగు చిత్రసీమలో సంచలనాల్ని సృష్టించారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ప్రస్తుతం ఆయన ఈ సినిమా హిందీ రీమేక్ కబీర్‌సింగ్‌ను రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 21న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సినిమా అనంతరం తాను ఓ పాన్‌ఇండియా మూవీకి సన్నాహాలు చేస్తున్నానని తెలిపారు సందీప్‌రెడ్డి వంగా. క్రైమ్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. బాహుబలి, కేజీఎఫ్ సినిమాల భారీ విజయాలు సినీ నిర్మాణంలో భాషా హద్దుల్ని చెరిపివేశాయి. అందుకే దేశవ్యాప్తంగా అందరికి కనెక్ట్ అయ్యే పాన్‌ఇండియా ఇతివృత్తంతో సినిమా చేద్దామనుకుంటున్నాను. ఇందులో ఎవరు నటిస్తారనే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విజయ్‌దేవరకొండతో కూడా టచ్‌లో ఉన్నాను. అయితే ప్రస్తుతం ఆయన వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు అని చెప్పారు సందీప్‌రెడ్డి. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువరించబోతున్నారని సమాచారం.

804

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles