అక్షయపాత్ర వేటలో..

Mon,November 11, 2019 12:12 AM

జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం జాక్‌పాట్. కల్యాణ్ దర్శకుడు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య నిర్మిస్తున్నారు. గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేస్తున్నది. పెళ్లి తర్వాత కొంత విరామం తీసుకున్న జ్యోతిక ఈ సినిమాతో చిత్రసీమలోకి పునరాగమనం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో జ్యోతిక, రేవతి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అదృష్టాన్ని కలిగించే ఓ పురాతన అక్షయపాత్రను పొందడానికి ఇద్దరు మహిళలు చేసిన ప్రయత్నాలేమిటన్నదే చిత్ర ఇతివృత్తం. ఆద్యంతం వినోదప్రధానంగా మెప్పిస్తుంది అని చిత్రబృందం తెలిపింది. యోగిబాబు, ఆనంద్‌రాజ్, మొట్ట రాజేంద్రన్, మన్సూర్‌అలీఖాన్, జగన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్‌ఎస్ ఆనందకుమార్, సంగీతం: విశాల్‌చంద్రశేఖర్, దర్శకత్వం: కల్యాణ్.

350

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles