14 ఏళ్ల తరువాత..?


Sat,April 13, 2019 01:04 AM

jyothika may acts nagarjuna bangarraaju movie

నాగార్జున ద్విపాత్రాభినయంలో మూడేళ్ల క్రితం వచ్చిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నాగార్జున కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని సాధించిన చిత్రంగా నిలిచింది. యాభై కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రానికి త్వరలో సీక్వెల్‌ని తెరపైకి తీసుకురాబోతున్నారు. మన్మథుడుచిత్రానికి సీక్వెల్‌ని ఇటీవలే మొదలుపెట్టిన నాగార్జున త్వరలో సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్‌ని పట్టాలెక్కించబోతున్నారు.
jyothika
బంగార్రాజు అనే పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహించబోతున్నారు. ఇందులో నాగార్జునకు జోడీగా నయనతార నటించనుందని ప్రచారం జరిగింది. అయితే ఆమె డేట్స్ సమస్య కారణంగా ఆ స్థానంలో జ్యోతికను చిత్ర బృందం ఖరారు చేసినట్లు తెలిసింది. గతంలో వీరిద్దరి కలయికలో మాస్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల విరామం తరువాత ఇద్దరు కలిసి మరోసారి ఈ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

1560

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles