జువ్వ గీతావిష్కరణ


Mon,February 12, 2018 11:10 PM

Juvva Movie Audio Launch

keeravani
సోమి ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం జువ్వ. రంజిత్, పాలక్ లల్వాని జంటగా నటిస్తున్నారు. త్రికోటి దర్శకుడు. భరత్ నిర్మాత. కీరవాణి సంగీతాన్నందించిన ఈ చిత్ర గీతాలు ఆదివారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా బాగుంటేనే కీరవాణిగారు సంగీతాన్నందిస్తారు. ఈ చిత్రం ద్వారా రంజిత్ నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రం తప్పకుండా అందరిని అలరిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. ఈ సినిమాకు మాటల రచయిత రత్నం మంచి కథనందించాడు. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. రవాణిగారు సంగీతాన్నందించడం అదృష్టంగా భావిస్తున్నాను. కథానుగుణంగా అద్భుతమైన బాణీలు కుదిరాయి అని దర్శకుడు చెప్పారు. కీరవాణి మాట్లాడుతూ దర్శకుడు త్రికోటి మొదటి చిత్రం దిక్కులు చూడకు రామయ్యకు నేనే సంగీతాన్నందించాను.

జువ్వ ఓ విందు భోజనంలాంటి సినిమా. ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. హీరోగా రంజిత్ నిలదొక్కుకుంటాడు. సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందనే విశ్వాసం ఉంది అని అన్నారు. తన తొలి చిత్రానికే లెజెండరీ సంగీత దర్శకుడు కీరవాణి స్వరాల్ని అందించడం అదృష్టంగా భావిస్తున్నానని, తనకు మంచి గుర్తింపునుతీసుకొచ్చే చిత్రమవుతుందని కథానాయకుడు రంజిత్ పేర్కొన్నాడు. నిర్మాత మాట్లాడుతూ నేటి యువతరాన్ని మెప్పించే చక్కటి కథ ఇది. రత్నం సంభాషణలు గుర్తుండిపోయేలా వుంటాయి. మా యూనిట్‌ను ఆశీర్వదించడానికి వచ్చిన బొత్స సత్యనారాయణ దంపతులకు కృతజ్ఞతలు. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, సప్తగిరి, అలీ, అడివి శేష్ తదితరులు పాల్గొన్నారు.

942

More News

VIRAL NEWS