ఇద్దరు రామయ్యలు


Fri,June 14, 2019 11:28 PM

Jr NTR introduces younger son Bhargav on first birthday

క్రేజీ కథానాయకుడు ఎన్టీఆర్‌కు ఇద్దరు కుమారులు. అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌. వీరిలో చిన్న కుమారుడు భార్గవ్‌ రామ్‌ శుక్రవారం పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన చిన్నకుమారుడితో కలిసి వున్న ఫొటోతో పాటు ఇద్దరు కుమారులు కలిసి దిగిన ఫొటోలని హీరో ఎన్టీఆర్‌ సోషల్‌ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ‘భార్గవ్‌ తొలి పుట్టిన రోజు’ అంటూ ఆ ఫొటోలకు క్యాప్షన్‌ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. తారక్‌ పెట్టిన ఈ పోస్ట్‌కు కొన్ని గంటల్లోనే లక్షల్లో లైక్స్‌ వచ్చాయి. భార్గవ్‌ రామ్‌ని అంతా ‘లిటిల్‌ టైగర్‌' అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. హీరో ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌'లో రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్రీకరణ దశలో వున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న విడుదల కానుంది.

2213

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles