రామ రౌద్ర రుషితం

Mon,October 7, 2019 12:25 AM

రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న తాజా చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఇందులో తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటిస్తున్నారు. ఆ పోరాట యోధుల చారిత్రక ఇతివృత్తానికి కాల్పనిక అంశాల్ని జోడించి రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దానయ్య నిర్మాత. ఇటీవలే బల్గేరియాలో ఓ షెడ్యూల్ పూర్తయింది. తర్వాతి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు ఏ టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారనే విషయం అందరిలో ఉత్సుకతను రేకెత్తిస్తున్నది. ఆర్.ఆర్.ఆర్ సంక్షిప్త నామాన్ని విస్తరిస్తూ అనేక టైటిల్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రామ రౌద్ర రుషితం అనే టైటిల్‌ను ఖరారు చేశారని సమాచారం. టైటిల్‌ను సూచించవొచ్చని కొన్ని నెలల క్రితం చిత్ర బృందం అభిమానుల్ని కోరిన విషయం తెలిసిందే. వందలాది టైటిల్స్‌ను పరిశీలించిన అనంతరం చివరకు రామ రౌద్ర రుషితం వైపు మొగ్గుచూపినట్లు తెలిసింది.
NTR

1200

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles