వెండితెరపై మిస్ యూఎస్


Sun,April 14, 2019 11:27 PM

Jo Sharma Jyotsna an Indian won the Miss USA international beauty talent contest

అందాల పోటీల్లో విజయం సాధించిన చాలా మంది వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న విషయం తెలిసిందే. ఇదే దారిలో తెలుగమ్మాయి జో శర్మ తెలుగులో కథానాయికగా పరిచయం కాబోతోంది. మిస్ యూఎస్ పోటీల్లో 15 దేశాలకు చెందిన 15 మందితో పోటీపడిన జో శర్మ అందం, ప్రతిభ, నృత్యం, మహిళా సాధికారత వంటి పలు విషయాల్లో తనదైన ప్రతిభతో ఆకట్టుకుని మిస్ యూఎస్‌గా ఎన్నికయ్యారు. ఆమెని ప్రముఖ నిర్మాత మోహన్ వడ్లపట్ల తెలుగు తెరకు కథానాయికగా పరిచయం చేయబోతున్నారు. ప్రస్తుతం లవ్ 20-20 పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న ఆయన త్వరలోనే ఓ కొత్త చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ సినిమా ద్వారా జోశర్మ కథానాయికగా పరిచయం కానుంది. మిస్ యుఎస్‌గా ఎంపికైన మన తెలుగమ్మాయి జోశర్మని నా తదుపరి చిత్రం ద్వారా కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాను. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలో వెల్లడిస్తాను అని తెలిపారు మోహన్ వడ్లపట్ల.

511
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles