అక్కాచెల్లెళ్ల కథ


Tue,March 12, 2019 12:12 AM

Jessie seals its release date

అతుల్ కులకర్ణి, కబీర్‌దుహన్‌సింగ్, అర్చనాశాస్త్రి, అషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రం జెస్సీ. వి. అశ్వినీ కుమార్ దర్శకుడు. శ్వేతాసింగ్ నిర్మాత. ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతున్నది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఇద్దరు అక్కాచెల్లెళ్ల నేపథ్యంలో సాగే కథ ఇది. వారి జీవితాల మీద నలుగురు ఘోస్ట్‌హంటర్స్ సాగించిన పరిశోధనలో ఏం తెలిసింది? జెస్సీ అనే ఆత్మ కారణంగా వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నదే చిత్ర కథ అన్నారు. పి.వి.ఆర్ సినిమాస్ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. థ్రిల్లర్ చిత్రాల్లో సరికొత్త జోనర్‌లో ఈ సినిమాను తెరకెక్కించాం అని నిర్మాత తెలిపారు. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ ఇదొక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది అన్నారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సినిమాటోగ్రఫీ: సునీల్‌కుమార్ ఎన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశ్వినీకమార్ వి.

1871

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles