కష్టమంతా మర్చిపోయాం!


Tue,March 19, 2019 11:50 PM

Jessie Movie Success Meet

అనేక అడ్డంకుల్ని దాటుకొని విడుదలచేసిన జెస్సీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభిస్తున్నదని అన్నారు దర్శకుడు అశ్వినికుమార్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం జెస్సీ. అతుల్ కులకర్ణి, కబీర్ దుహన్‌సింగ్, అర్చనా శాస్త్రి, ఆషిమా నర్వాల్ ప్రధాన పాత్రలను పోషించారు. శ్వేతాసింగ్ నిర్మాత. ఇటీవలే ఈ చిత్రం విడుదలైంది. సోమవారం హైదరాబాద్‌లో చిత్రబృందం విజయోత్సవ వేడుకను నిర్వహించింది. నిర్మాత మాట్లాడుతూ ఎన్నో సంశయాల మధ్య సినిమాను విడుదలచేశాం. మంచి చిత్రమని ప్రేక్షకులు చెబుతున్న మాటలు మా కష్టాన్ని మరిపించాయి. మాపై నమ్మకంతో పీవీఆర్ సినిమాస్ ఈ చిత్రాన్ని విడుదలచేసింది. వారి నమ్మకం నిజమైంది అని తెలిపారు. కథ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ చిత్రం మరోసారి నిరూపించిందని దర్శకుడు చెప్పారు. పీవీఆర్ ప్రతినిధి ఉదయ్ మాట్లాడుతూ ఒక్క షోతో ప్రారంభమైన ఈ చిత్రం మల్టీప్లెక్స్‌లలో ఏడు షోలకు పెరిగింది. వసూళ్లు బాగున్నాయి అని అన్నారు. ఈ వేడుకలో ఆషిమా నర్వాల్, శ్రీచరణ్ పాకాల పాల్గొన్నారు.

514

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles