జెర్సీజీవితాంతం గుర్తుండిపోతుంది!


Tue,April 23, 2019 11:54 PM

jersey movie appreciation meet set 2

ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు వస్తాయి. సక్సెస్‌లను సాధిస్తాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. జెర్సీ అలాంటి సినిమానే అని అన్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. నాని, శ్రద్ధాశ్రీనాథ్ జంటగా నటించిన చిత్రం జెర్సీ. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సోమవారం హైదరాబాద్‌లో అభినందన సమావేశాన్ని ఏర్పాటుచేసిన దిల్‌రాజు జెర్సీ చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వారాల ముందు నానితో కలిసి ఈ సినిమా చూశాను. ఒక మంచి సినిమా తీశారని అప్పుడే అనిపించింది. భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని సంభాషణలు లేకుండా సినిమాలో హృద్యంగా ఆవిష్కరించారు దర్శకుడు గౌతమ్. ఒక్క సినిమా అనుభవంతోనే గొప్ప సినిమా తీశాడు. సక్సెస్, ఫెయిల్యూర్స్‌కు అతీతంగా జీవితాంతం గుర్తుండిపోయే సినిమా చేశాడు.

సినిమాలు ఆడినా ఆడకపోయినా నాని పాత్ర గుర్తుండిపోతుంది. సక్సెస్‌ఫుల్ సినిమాలో నాని ఉంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఈ సినిమా మరోసారి నిరూపించింది. పారితోషికం కాకుండా లాభాల్లో వాటా తీసుకుంటానని చెప్పి నాని ఈ సినిమా అంగీకరించారని నిర్మాత చినబాబు నాతో అన్నారు. ఆయన మాటలు వినగానే కన్నీళ్లు వచ్చాయి. హీరోలు అలా ముందుకు వచ్చినప్పుడే మంచి సినిమాలు వస్తాయి. డబ్బుల కోసం ఆలోచించకుండా నాని మంచి సినిమాను ప్రోత్సహించడం అభినందనీయం. సమిష్టి కృషికి దక్కిన విజయమిది అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ప్రీ రిలీజ్ వేడుకలో నాని మాటలతో పాటు సినిమాపై ఉన్న అంచనాలు చూసి చాలా భయపడ్డాను. విడుదల తర్వాత సినిమాకు వస్తున్న స్పందనతో ఆ భయాలన్నీ దూరమయ్యాయి. సినిమా అందరికి నచ్చడం ఆనందంగా ఉంది. ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రతి ఒక్కరూ బాగుందని మెచ్చుకుంటున్నారు. ఇలాంటి ప్రశంసలే మంచి సినిమా తీయడానికి స్ఫూర్తినిస్తాయి అని తెలిపారు. నాని మాట్లాడుతూ కథ విన్నప్పుడే సినిమా అద్భుతాల్ని సృష్టిస్తుందని నమ్మాను. అది నిజమైంది.
Shraddha-Srinath
విడుదల రోజు తొలి ఫోన్‌కాల్ దిల్‌రాజు నుంచి వస్తే ఆ సినిమా హిట్టయినట్లే. ఈ సినిమాకు అదే జరిగింది. ఆయన ఫోన్‌కాల్‌తో సినిమా హిట్టని ఫిక్సయిపోయాను. గౌతమ్ రాసుకున్న కథలో చాలా నిజాయితీ ఉంది. మనసులో నుంచి కథలు పుట్టినప్పుడే మ్యాజిక్ జరుగుతుంది. కథలకు జీవం వస్తుంది. నన్ను కాకుండా నాలో అర్జున్‌ను చూసినందుకు, తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమాను ఇచ్చినందుకు గౌతమ్‌కు కృతజ్ఞతలు. తెలుగు సినిమా గర్వపడే దర్శకుడిగా అతడు ఎదుగుతాడు. నిర్మాత వంశీ మనసుకు బాగా దగ్గరైన సినిమా ఇది. ఎంతగానో నమ్మి ఈ సినిమా చేశాడు. కెమెరామెన్, కళా దర్శకుడు, ఎడిటర్ ప్రతి ఒక్కరూ తమ సాంకేతిక ప్రతిభతో కథను చెప్పారు. ఈ వేదికపై ఉన్న అందరూ పాతబడిపోవచ్చు. కానీ జెర్సీ సినిమా మాత్రం ఎప్పటికీ పాతబడిపోదు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రద్ధాశ్రీనాధ్, బ్రహ్మాజీ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

1423

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles