శశికళ పాత్రలో..

Tue,December 3, 2019 11:39 PM

దివంగత సినీనటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ‘తలైవి’ పేరుతో వెండితెరపై ఆవిష్కృతం కాబోతున్నది. జయలలిత పాత్రలో కంగనారనౌత్‌ నటిస్తున్నది. ఏ.ఎల్‌. విజయ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శశికళ పాత్రను ప్రియమణి పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జయలలిత జీవితంలో శశికళ పాత్ర కీలకంగా ఉంటుంది. జయలలిత ప్రాణస్నేహితురాలిగా మరణం వరకు వెన్నంటి నిలిచారామె. ముఖ్యమైన ఈ పాత్ర కోసం పలువురు తారల పేర్లను పరిశీలించిన చిత్రబృందం ప్రియమణిని ఎంచుకున్నట్లు తెలిసింది. ఈ పాత్రకు తగినట్లుగా మేకోవర్‌ అయ్యే ప్రయత్నాల్లో ప్రస్తుతం ప్రియమణి ఉన్నట్లు సమాచారం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విష్ణు ఇందూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

223

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles