జయలలిత పుట్టినరోజున..


Sun,January 6, 2019 11:24 PM

Jayalalithaa biopic starring Nithya Menen to go on floors in February

దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ది ఐరన్ లేడీ పేరుతో ఓ చిత్రం తెరకెక్కనున్నది. టైటిల్ పాత్రలో నిత్యామీనన్ నటించనున్నది. జయలలిత పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 24న ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మిస్కిన్ వద్ద సహాయకురాలిగా పనిచేసిన ప్రియదర్శిని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. జయలలిత పాత్ర తీరుతెన్నుల కోసం ఇప్పటికే నిత్యామీనన్ పరిశోధన ప్రారంభించినట్లు తెలిసింది. ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్రలో మలయాళ నటుడు సుకుమారన్ నటించనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ప్రధాన ఘట్టాలను తెరకెక్కించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నిత్యామీనన్ ప్రాణ అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నది. ఏకపాత్రతో రూపొందిస్తున్న ఈ సినిమాలో నిత్యామీనన్ రచయత్రి పాత్రలో కనిపించబోతున్నది.

1500

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles