విప్లవ నాయకి ప్రస్థానం


Sun,September 8, 2019 08:08 AM

Jayalalithaa Biopic Queen Movie Stars Ramya Krishnan

విప్లవ నాయకిగా తమిళ ప్రజల నీరాజనాలందుకున్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా క్వీన్ పేరుతో ఓ వెబ్‌సిరీస్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గౌతమ్‌మీనన్, ప్రశాంత్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ కథానాయిక రమ్యకృష్ణ టైటిల్ రోల్‌ని పోషిస్తున్నది. ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శనివారం సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు. తెల్లచీర ధరించి భుజంపై తన పార్టీ ఏఐఏడీఎంకే పతాకాన్ని వేసుకొని భారీ జనసమూహం అభిముఖంగా ప్రసంగిస్తున్న జయలలిత స్టిల్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నది. జయలలిత రాజకీయ అరంగేట్రం చేసిన తొలినాళ్లను తలపించే ఈ పోస్టర్ ను చూసి తమిళనాట ఆమె అభిమానులు భావోద్వేగంతో స్పందిస్తున్నారు. జయలలిత సినీ, రాజకీయ జీవితంలో చోటుచేసుకున్న ముఖ్య సంఘటనలు, చిరస్మరణీయమైన ఘట్టాల్ని స్పృశిస్తూ ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఓ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై త్వరలో ఈ సిరీస్‌ను విడుదల చేయబోతున్నారు.

614

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles