జాన్వీ పైలెట్ శిక్షణ!


Tue,April 16, 2019 11:57 PM

Janhvi Kapoor opts for an all grey gym gear for her workout session

ధడక్ చిత్రంతో అరంగేట్రంలోనే ప్రతిభను చాటింది దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. కెరీర్ పరంగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు, గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్న ఆమె తల్లి బాటలోనే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలపై దృష్టిసారిస్తున్నది. ప్రస్తుతం ఐఏఎఫ్ మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత కథలో నటిస్తున్నది జాన్వీ. ఈ సినిమా కోసం ఆమె యుద్ధ విమానాలు నడపటంలో శిక్షణ తీసుకుంటున్నది. కార్గిల్ యుద్ధంలో గాయాల పాలైన భారత సైనికుల్ని ప్రాణాలకు తెగించి సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా ధైర్యసాహసాల్ని, పోరాట పటిమను ఆవిష్కరిస్తూ దర్శకనిర్మాత కరణ్‌జోహార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కథానుగుణంగా ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుండటంతో ఈ బయోపిక్ కోసం జాన్వీ కపూర్ యుద్ధ విమానాల్ని నడపటంలో శిక్షణ తీసుకుంటున్నట్లు చిత్రబృందం తెలిపింది మామూలు పైలెట్ ట్రైనింగ్‌తో పోలిస్తే ఈ శిక్షణ కొంత కఠినతరంగా ఉంటుందని, కానీ పాత్ర కోసం జాన్వీ రిస్క్ తీసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. దాదాపు రెండు నెలల పాటు ఆమె ఈ శిక్షణ తరగతులకు హాజరుకానుందని చెబుతున్నారు. జాన్వీ కపూర్‌తో పాటు అంగద్‌బేడీ, పంకజ్ త్రిపాఠి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.

561

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles