మా అబ్బాయి కోసం సినిమా చేశాను


Thu,July 11, 2019 12:32 AM

jagapati babu and nani at the lion king movie telugu press meet

లయన్‌కింగ్ మా అబ్బాయి అర్జున్ కోసం చేశాను. మణిరత్నం ఓకే బంగారం తర్వాత నేను డబ్బింగ్ చెప్పిన రెండో సినిమా ఇది అని అన్నారు హీరో నాని. హాలీవుడ్ చిత్రం ది లయన్ కింగ్ తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమాలో సింబా పాత్రకు హీరో నాని, స్కార్ పాత్రకు జగపతిబాబు, ముఫాసా పాత్రకు పి.రవిశంకర్, టైమస్ పాత్రకు అలీ, పుంబ పాత్రకు బ్రహ్మానందం డబ్బింగ్ చెప్పారు. ఈ నెల 19న ఈ చిత్రం విడుదలకానుంది. తెలుగు ట్రైలర్‌ను మంగళవారం విడుదలచేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ హీరో సింబా పాత్రకు నేను గళాన్ని అందించాను. ఇదివరకు తెలుగులో అనువాదమైన హాలీవుడ్ సినిమాలతో పోలిస్తే భిన్నమైన అనుభూతిని పంచుతుంది. తొలిసారి అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో కూడిన లైవ్‌యాక్షన్ యానిమేషన్ సినిమాను తెలుగులో చూస్తున్నట్లు ఉంటుంది.

నాతో పాటు జగపతిబాబు, బ్రహ్మానందం, అలీ, రవిశంకర్ డబ్బింగ్ చెప్పడం వల్ల ఈ సినిమాలోని పాత్రలు, వాటి తాలూకూ ఎమోషన్స్‌తో తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. మన భారతీయ కథ ఇది. రజనీకాంత్ నరసింహా సినిమాకు ఈ కథనే మూలం. మనదైన కథతో హాలీవుడ్ వాళ్లు ఈ సినిమా చేశారు. రవిశంకర్, జగపతిబాబుల వాయిస్‌లతో నా గళం మ్యాచ్ అవుతుందో లేదో అని చాలా భయపడ్డాను.అందరికంటే ముందు ఈ సినిమా నేను చూడొచ్చనే ఆలోచనతో డబ్బింగ్ చెప్పడానికి అంగీకరించాను అని అన్నారు. జగపతిబాబు మాట్లాడుతూ సినిమాలకు పనికి రాదన్న నా గొంతు డిస్నీ చిత్రానికి డబ్బింగ్ చెప్పే స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది. నాకు ఇష్టంలేనివి జీవితంలో ఏం చేయకూడదని అనుకున్నానో అన్ని చేస్తున్నాను. యానిమేషన్ సినిమాలో కూడా విలన్ పాత్రకే డబ్బింగ్ చెప్పాల్సివచ్చింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో అలీ, రవిశంకర్, లిప్సిక పాల్గొన్నారు.

1881

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles