వీరారెడ్డి రాజసం


Wed,February 13, 2019 12:10 AM

Jagapathi Babu look from Sye Raa Narasimha Reddy revealed

సెకండ్ ఇన్నింగ్స్‌లో విలక్షణ పాత్రలతో అభినయకౌశలాన్ని చాటుకుంటున్నారు జగపతిబాబు. ప్రస్తుతం ఆయన చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. మంగళవారం జగపతిబాబు పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఈ సినిమాలో వీరారెడ్డి పాత్రలో జగపతిబాబు కనిపించబోతున్నారు. పొడవైన కేశాలు, గుబురు గడ్డం, మెలి తిరిగిన మీసాలతో తలపాగా చుట్టుకొని తీక్షణంగా చూస్తున్న జగపతిబాబు వినూత్న వస్త్రధారణతో కనిపిస్తున్నారు. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్‌బచ్చన్, నయనతార, సుదీప్, విజయ్‌సేతుపతి, తమన్నా కీలక పాత్రలను పోషిస్తున్నారు. దాదాపు రెండు వందల కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకులముందుకురానుంది.

1591

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles