రాజారెడ్డి పాత్రలో..


Fri,January 4, 2019 12:34 AM

Jagapathi Babu as YSR father

దివంగత ముఖ్యమంత్రి డా॥ వై.యస్.రాజశేఖర్‌రెడ్డి రాజకీయ జీవితంలో కీలక ఘట్టమైన పాదయాత్రను కథాంశంగా ఎంచుకొని రూపొందిస్తున్న చిత్రం యాత్ర. వైయస్‌ఆర్ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు. మహి వి రాఘవ్ దర్శకుడు. ఫిబ్రవరి 8న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో వైయస్‌ఆర్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటించారు. ఆయన ఫస్ట్‌లుక్‌ను గురువారం విడుదల చేశారు. నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ రైతుల్ని కలుసుకొని నేరుగా వారి బాధల్ని వినడానికి వైయస్‌ఆర్ పాదయాత్రను చేపట్టారు. వాస్తవ కోణంలో ఆవిష్కరిస్తూ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

రాజారెడ్డి పాత్ర చిన్నదే అయినా జగపతిబాబుగారు దానికి ప్రాణం పోశారు అన్నారు. రావు రమేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని కృష్ణమురళి, సచిన్ కడ్కర్, వినోద్‌కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: సత్యన్ సూర్యన్, సంగీతం: క్రిష్ణ కుమార్, నిర్మాణ సంస్థ: 70ఎం.ఎం.ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాతలు: విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహి వి రాఘవ్.

2284

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles