మహాలక్ష్మి విదేశీయాత్ర


Fri,January 18, 2019 11:29 PM

its a wrap for tamannaah bhatia starrer that is mahalakshmi

మహాలక్ష్మి పల్లెటూరి యువతి. పెద్దల అంగీకారంతో ప్రియుడి తోడుగా ఏడడుగులు వేయాలని కలలు కంటుంది. కాబోయే భర్తతో కలిసి హనీమూన్‌కు పారిస్ వెళ్లాలన్నది ఆమె కోరిక. కానీ పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో మహాలక్ష్మి ఒంటరిగా పారిస్‌కు పయనం అవుతుంది. అక్కడ ఆమెకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? ఈ ప్రయాణంలో ఆమె అవగతం చేసుకున్న జీవిత సత్యాలేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం దటీజ్ మహాలక్ష్మి. టైజాన్ ఖొరాకివాలా సమర్పణలో మను కుమరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాత మాట్లాడుతూ సాధారణ యువతి అసాధారణ మహిళగా ఎలా మారిందనే స్ఫూర్తిదాయక కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. తమన్నా అభినయం, పాత్రచిత్రణ, అమిత్ త్రివేది సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుతున్నాం. త్వరలో విడుదల తేదీని వెల్లడిస్తాం అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మైఖేల్ టబ్యూరియస్, ఎడిటింగ్: గౌతమ్‌రాజు.

833

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles