ప్రయాణంలో పదనిసలు


Sun,August 25, 2019 11:38 PM

Itlu Mee Srimathi Movie Opening Ceremony

కృష్ణచంద్ర, కరోణ్య కత్రిన్ జంటగా నటిస్తున్న చిత్రం ఇట్లు మీ శ్రీమతి. హంసవాహిని టాకీస్ పతాకంపై ఎం.ఎస్.రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీ బోడపాటి దర్శకుడు. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.ఎల్. దామోదరప్రసాద్ క్లాస్‌నివ్వగా, ప్రసన్నకుమార్ కెమెరా స్విఛాన్ చేశారు. సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ రోడ్ జర్నీ నేపథ్యంలో రూపొందుతున్న వినోదభరిత చిత్రమిది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగుతూ ఉత్కంఠను పంచుతుంది. అక్టోబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్‌లో పూర్తిచేస్తాం అని తెలిపారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే చిత్రమిదని నిర్మాత పేర్కొన్నారు. మహిళలకు ఈ చిత్రం చక్కటి సందేశాన్ని అందిస్తుందని కథానాయిక కరోణ్య కత్రిన్ చెప్పింది. ఇందులో మూడు పాటలుంటాయని, సంగీతానికి ప్రాధాన్యమున్న చిత్రమిదని సంగీత దర్శకుడు వెంగీ పేర్కొన్నారు. డి.ఎస్.రావ్, శశి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వెంగీ, ఛాయాగ్రహణం: తోట.వి.రమణ.

229

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles