పూరితో సినిమా చేస్తే ఆ కిక్కే వేరు!


Mon,July 8, 2019 11:49 PM

iSmart Shankar Release On July 18th

రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. పూరి జగన్నాథ్ దర్శకుడు. నిధి అగర్వాల్, నభా నటేష్ కథానాయికలు. పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మాతలు. ఈ నెల 18న ప్రేక్షకులముందుకురానుంది. ఆదివారం రాత్రి ఇస్మార్ట్ బోనాలు పేరుతో వరంగల్ పట్టణంలో వేడుకను నిర్వహించారు. రామ్ మాట్లాడుతూ బోనాల పండగను వరంగల్‌లో సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉంది. ఈ సినిమా పాయింటే చాలా కొత్తగా ఉంది. తెలంగాణ యువకుడి పాత్రలో నటించడం అంత సులభం కాదు. నభా నటేష్ చక్కటి నటనను కనబరిచింది. వరంగల్ కాలేజీ యువకుల మీద ఓ కౌంటర్ వేసింది. సినిమాలో బోనాల పాట హైలైట్‌గా నిలుస్తుంది. పూరి జగన్నాథ్‌తో సినిమా చేస్తే ఆ కిక్కే వేరు.షూటింగ్ పూర్తవుతుందంటే చాలా బాధగా అనిపించింది అన్నారు.

పూరి జగన్నాథ్ మాట్లాడుతూ హైదరాబాద్ రౌడీ అయిన ఇస్మార్ట్ శంకర్‌కు పోలీసోళ్లు డిప్పలో బొక్కపెట్టి చిప్పలోకి సిమ్‌కార్డ్ పెట్టిండ్రు. అదెందుకు పెట్టారు? ఆ తర్వాత ఏమైందన్నదే చిత్ర కథ. ఆద్యంతం వినోదప్రధానంగా సాగే కథ ఇది. టెంపర్ తర్వాత నాకు సరైన హిట్ లేదు. విపరీతమైన ఆకలితో ఉన్న సమయంలో రామ్ దొరికాడు. వెజిటేరియన్ ముసుగులో ఉన్న నాన్ వెజిటేరియన్ యువకుడు రామ్. అతను చిరుతపులిలాంటోడు. సినిమా తప్ప మరో ధ్యాస ఉండదు. ఈ సినిమాకు మణిశర్మగారు అద్భుతమైన ఐదు పాటలిచ్చారు. బోనాలు టైంలో ఈ సినిమా విడుదల కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా హిట్ అయ్యాక డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తీయాలి. అంతకుమించి కోరికలు ఏం లేవు అన్నారు. ప్రేక్షకులందరికి నచ్చే కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్ ఇదని, ఆద్యంతం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని ఛార్మి చెప్పింది. తామిద్దరం వరంగల్ రావడం ఇది రెండోసారని.. పూరిజగన్నాథ్, రామ్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చిందని కథానాయికలు నభానటేష్, నిధి అగర్వాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

1104

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles